ఆమె ఎంట్రీతో పంచాయతీ ఎన్నికలకు మరింత అందం! | Model Beauty Queen Diksha Singh To Contest UP Panchayat Poll | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లో మిస్‌ ఇండియా ఫైనలిస్టు

Apr 3 2021 12:24 PM | Updated on Apr 3 2021 2:51 PM

Model Beauty Queen Diksha Singh To Contest UP Panchayat Poll - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం  పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు కాస్త ఆసక్తిగా మారాయి. ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్ పంచాయతీ పోరులో భాగంగా ఆ గ్రామ 26వ వార్డు నుంచి మోడల్‌, అందాల రాణి దీక్షా సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు అందం తోడైంది. తన  తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి రానుంది. ఈ ఎన్నికల్లో బ్లాక్‌లో 26 వార్డు స్థానాన్ని మహిళకు కేటాయించగా, తండ్రి జితేంద్ర సింగ్‌ తన కుతూరును ఎన్నికల బరిలోకి దించాడు. ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి భాజపా అభ్యర్థి షాలినీ సింగ్‌తో పోటీ పడనున్నారు.

కాగా, బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామానికి చెందిన దీక్ష సింగ్‌ 2015లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అంతేకాకుంగా  పలు  ప్రైవేటు ఆల్బమ్స్‌తో పాటు పలు ప్రకటనల్లో కూడా కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ‘రబ్బా మెహర్ కారి’ పాటలో తలుక్కున మెరిసింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా, యూపీలో ఏప్రిల్‌ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జాన్‌పూర్‌లో ఏప్రిల్‌ 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 

చదవండి: ఎన్నికల రిజర్వేషన్‌ మహిళకు రావడంతో... పెళ్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement