
థానే: మహారాష్ట్రలో భాషా వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రంలోని థానేలో చోటుచేసుకున్న ఒక బాషా వివాదంపై రాజ్‌థాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఎన్‌ఎస్ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసన తెలుపుతున్నందున వారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ సమయంలో నిరసనల్లో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజల మార్చ్‌కు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎంఎస్‌ఎన్‌కు నిరసన ప్రదర్శనలకు ఒక నిర్ధిష్ట మార్గాన్ని కేటాయించారని, అయితే అది కాదని, వారు వేరే మార్గంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి మార్చ్‌ను అడ్డుకున్నారని వివరించారు.
మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు దుకాణ యజమానిపై ఇటీవల ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా వ్యాపారుల నిర్వహించిన ఆందోళనను తిప్పికొట్టేందుకు ఎంఎన్‌ఎస్ ఈ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఎంఎస్‌ఎస్ కార్యకర్తల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనిపై ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ మీరా రోడ్దులో వ్యాపారులు మార్చ్ నిర్వహించారని, తమకు ఇదే ప్రాంతంలో నిరసన నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఇక్కడ తమకు మార్చ్‌కు అనుమతించే వరకు విశ్రమించేది లేదని ఎంఎన్‌ఎస్ ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్‌పాండే పేర్కొన్నారు.
ఇటీవల మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఒక దుకాణ యజమానిపై ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన దరిమిలా వ్యాపారులు నిరసన చేపట్టారు. దీనిని ఖండిస్తూ ఈరోజు(మంగళవారం) ఎంఎన్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే దీనికిముందు స్థానిక ఎంఎన్‌ఎస్ నేత అవినాష్ జాదవ్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా రాష్టంలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాషా వివాదాన్ని మరింతగా పెంచాయి. ప్రతిపక్షాలతో పాటు వివిధ భాషా సంఘాల నుండి వ్యతిరేకత వచ్చిన దరిమిలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.