సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్‌.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్‌లు | Sakshi
Sakshi News home page

Samajwadi Party Perfume: సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్‌.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్‌లు

Published Tue, Nov 9 2021 9:10 PM

Memes On Akhilesh Yadav launches Samajwadi Party Perfume Ahead Elections - Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ వినూత్న ఆలోచన చేశారు. త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజ్‌ వాదీ పార్టీ అత్తర్‌ బ్రాండ్‌ పేరుతో పెర్ఫ్యూమ్‌ను ప్రారంభించారు. ఈ అత్తర్‌ సీసాపై సైకిల్‌ గుర్తును కూడా ముద్రించారు. అంతేగాక కవర్‌పై అ ఖిలేష్‌ యాదవ్‌ బొమ్మ కూడా ఉండేలా రూపొందించారు. రెడ్‌, గ్రీన్‌ కలర్‌లో తయారు చేసిన ఈ 22 సహజసిద్ధ సుగంధాలతో రూపొందించారు.
చదవండి: యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్‌ యాదవ్‌ సంచలన ప్రకటన
చదవండి: Navjot Singh Sidhu: పంజాబ్‌లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ

అయితే ఎన్నికల్లో ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఆసక్తికర నిర్ణయంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంచి ఆలోచన అంటూ మద్దతిస్తుంటే మరికొంతమంది ఎస్పీ పార్టీని తీవ్ర ట్రోల్స్‌తో ముంచెత్తుతున్నారు. ‘సమాజ్‌వాద్‌ అత్తర్‌ చాలా ఫన్నీగా ఉంది. బీజేపీలో మోదీ, యోగి సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అంటుంటే అఖిలేష్‌ యాదవ్‌ ‘సమాజ్‌ వాదీ అత్తర్’ అంటున్నాడు. ఈసారి యూపీ ఎన్నికల్లో నేను తటస్థంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. కానీ సమాజ్‌ వాదీ పార్టీ నన్ను బీజేపీకి ఓటు వేసేలా చేస్తుంది. సమాజ్‌వాదీ అత్తర్‌ ‘వాహ్ భాయ్ వాహ్’...’ అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. చూడాలి మరి సమాజ్‌వాదీ అత్తరు..ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాబడుతుందో.
చదవండి: బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్‌

కాగా ఎస్పీ పార్టీ అత్తర్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో అఖిలేష్ యాదవ్ యూపీలో తన పార్టీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సమాజ్‌వాదీ సుగంధ్' పేరుతో పలు రకాల పెర్ఫ్యూమ్‌లను ప్రారంభించారు. ఈ పెర్ఫ్యూమ్ నాలుగు సువాసనలతో, ప్రతి సీసా నాలుగు వేర్వేరు నగరాల(ఆగ్రా, లక్నో, వారణాసి, కన్నౌజ్) సువాసనను అందిస్తుంది.

Advertisement
Advertisement