ప్రభుత్వ ఉద్యోగంతో పాటు సొంత ఇళ్లు : సీఎం

Manipur CM Promises Govt Job To Man Wrongly Jailed For 8 years - Sakshi

ఇంఫాల్‌ : అత్యాచారం, హత్య కేసులో 8ఏళ్ల జైలు శిక్ష అనంతరం నిర్దోషిగా బయటకొచ్చిన వ్యక్తికి సీఎం శుభవార్త చెప్పారు.  వివరాల ‍ ప్రకారం..2013లో మణిపూర్‌లోని రిమ్స్‌లో పాథాలజీ విభాగానికి చెందిన ఓ విద్యార్ధిని హత్యాచారానికి గురయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సహచర విద్యార్ధి తౌడమ్ జిబల్ సింగ్‌ను చేరుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే అనూహ్యంగా ఎనిమిదేళ్ల అనంతరం జిబల్‌ సింగ్‌ నిర్దోషి అని తేలింది. దీంతో అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని  మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు.  (ఘరానా మహిళ.. వలవేసి దోచేసింది)

'ఈ కేసులో అమాయకుడైన జిబల్ సింగ్‌ జైలు చేయని నేరానికి జైలు  శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా ప్రజలు అతని ఇంటిని సైతం దహనం చేశారు. ఈ నేపథ్యంలో అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా నిర్ణయించాం' అని సీఎంపేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో సంతోషంలో మునిగిన  జిబల్‌ సింగ్‌ జైలు నుంచి విడుదల కాగానే  సీఎం బీరెన్ సింగ్‌ను కలిశారు.  (లోన్‌ యాప్‌.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top