లక్కీ ఫెలో.. భార్య వద్దన్నా లాటరీ టికెట్‌ కొన్నాడు.. చివరకు కోట్ల డబ్బు..

Man Wins By lottery Ticket At Punjab State Lottery - Sakshi

ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్‌ కొంటున్న వ్యక్తి బంపర్‌ ప్రైజ్‌ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. భ‌టిండా జిల్లాకు చెందిన రోష‌న్ బ‌ట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్‌కు లాటరీ టికెట్స్‌ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్‌లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్‌ కొనడంతో రోష‌న్ భార్య త‌ర‌చూ అత‌డిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. 

ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంప‌ర్ లాట‌రీలో మెగా ప్రైజ్ గెలుపొంద‌డంతో రోష‌న్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మొదట బంప‌ర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్‌కు డీలర్‌ నుంచి ఫోన్ కాల్‌ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాట‌రీ సెంట‌ర్ నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్‌ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేద‌ని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై ప‌న్నుల‌న్నీ తీసాక త‌మ‌కు రూ 1.75 కోట్లు వ‌స్తాయ‌ని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: బైక్‌పై లవర్స్‌ హల్‌చల్‌.. వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top