భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే? | Man Bites Wife Nose Off During Fight Over Repaying Loan In Karnataka | Sakshi
Sakshi News home page

భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?

Jul 11 2025 6:44 PM | Updated on Jul 11 2025 7:31 PM

Man Bites Wife Nose Off During Fight Over Repaying Loan In Karnataka

బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

మంగళవారం జరిగిన  ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను  స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement