breaking news
wife nose
-
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.మంగళవారం జరిగిన ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. -
భార్యతో గొడవపడి ముక్కు కోశాడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి భార్య పట్ల ఉన్మాదిలా ప్రవర్తించాడు. భార్యతో గొడవపడి కోపంతో ఆమె ముక్కు కోశాడు. కాన్పూర్ సమీపంలోని చండీపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సంజయ్ సాహూ అనే వ్యక్తి ఓ విషయంపై తన భార్య ఆశతో గొడవపడ్డాడు. ఆ సమయంలో సాహు స్నేహితుడు మనీష్ అక్కడే ఉన్నాడు. మనీష్.. ఆశను బంధించగా.. సాహూ కత్తితో భార్యపై దాడి చేసి ఆమె ముక్కు కోశాడు. బాధితురాలి అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చారు. సాహు అక్కడి నుంచి పారిపోగా, మనీస్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.