Mamata Banerjee Dances With Folk Artists at Independence Day Event in Kolkata - Sakshi
Sakshi News home page

Mamata Banerjee: జానపద కళాకారులతో కలిసి డ్యాన్స్‌ చేసిన సీఎం మమతా బెనర్జీ

Aug 15 2022 4:59 PM | Updated on Aug 15 2022 6:01 PM

Mamata Banerjee Aances With Folk Artists at Independence Day Event in Kolkata - Sakshi

కోల్‌కతా: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు.  ఈక్రమంలో ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాతంత్ర్య వేడుకల్లో సరదాగా గడిపారు. కోల్‌కతాలో స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మమతా బెనర్జీ.. జానపద నృత్య కళాకరులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. అక్కడి మహిళల చేతుల్లో చేయి కలిపి స్టెప్పులేశారు.  ఇక వారితో డ్యాన్స్ అనంతరం ఆమెకు గౌరవంగా.. అక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులంతా నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.  దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
చదవండి: సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటుపై ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement