సావర్కర్‌ పోస్టర్‌పై కర్ణాటకలో ఉద్రిక్తత.. కర్ప్యూ విధింపు!

Tension Over Savarkar Poster Curfew Imposed In Shivamogga - Sakshi

బెంగళూరు:  వీర్‌ సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్‌ అహ్మెద్‌ సర్కిల్‌లో వీర్‌ సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్‌ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్‌ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్‌కల్ జంక్షన్‌కు హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరును మారుస్తూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బ్యానర్‌ను తొలగించారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్‌ షెట్టీ అభ్యర్థనతో సర్కిల్‌కు సావర్కర్‌ పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది నగర కార్పొరేషన్‌. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో సూరత్‌కల్‌ సర్కిల్‌ చాలా సున్నితమైన ప్రాంతమని, సావర్కర్‌ పేరు పెట్టటాన్ని తాము తీవ్రంగా వ‍్యతిరేకిస్తున్నామని ఎస్‌డీపీఐ స్థానిక కార్యకర్త ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: Vinayak Damodar Savarkar: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top