అద్దెకు గది కావాలంటూ కోరిన 14 ఏళ్ల బాలిక.. ఆటో డ్రైవర్‌ సమయస్పూర్తిగా వ్యవహరించి..

Maharashtra: Auto Driver Reunites Teen Girl With Delhi Kin - Sakshi

సాక్షి, ముంబై: ఓ ఆటోడ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పారిపోయిన ఓ బాలిక తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పాలఘర్‌లోని వసాయి రైల్వే స్టేషన్‌ వద్ద రాజు కర్వాడే (35) అనే ఆటోడ్రైవర్‌ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా..ఓ బాలిక (14) ఒంటరిగా అతని వద్దకు వచ్చి ఇక్కడ ఉండేందుకు మంచి గది అద్దెకు దొరుకుతుందేమోనని అడగ్గా.. రాజు బాలికకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. ఆ బాలిక మాటల్లో ఆమెది ఢిల్లీ అని, తల్లిదండ్రులతో గొడవపడి ఇంటినుంచి పారిపోయివచ్చినట్లు తెలుసుకున్న ఆటోడ్రైవర్‌ రాజు బాలికను నేరుగా బాలికను మానిక్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు.

పోలీసులు ఆ బాలిక చెప్పిన వివరాలను బట్టి ఢిల్లీలోని సాకేత్‌ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక తప్పిపోయిన ఫిర్యాదును అందుకున్నట్లు తెలుసుకున్న మానిక్‌పూర్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి వివరాలు అడిగితెలుసుకుని ఈ బాలిక గురించి సమాచారం అందించారు. సాకేత్‌ పోలీసుల నుంచి అందిన వివరాల ద్వారా బాలిక తల్లిదండ్రులకు మానిక్‌పూర్‌ పోలీసులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలికను తీసుకెళ్లారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు చేరవేయటంలో కీలకపాత్ర పోషించిన ఆటోడ్రైవర్‌ రాజు కర్వాడేను పోలీసులు అభినందించారు. 
చదవండి: ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top