ఆన్‌లైన్‌ గేమ్‌లకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి | Madras High Court Upholds Night Ban On Online Real Money Games In Tamil Nadu, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమ్‌లకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి

Jun 4 2025 12:15 PM | Updated on Jun 4 2025 12:43 PM

Madras High Court upholds night ban on online real money games in Tamil Nadu

 మద్రాసు హైకోర్టు తీర్పు 

కొరుక్కుపేట: తమిళనాడులో ఆన్‌లైన్‌ గేమ్‌లను నియంత్రించడానికి ఆన్‌లైన్‌ గేమ్‌ల నియంత్రణ చట్టం– 2022 ప్రకారం నియమాలు ప్రకటించారు. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడానికి ఆధార్‌ లింక్‌ను తప్పనిసరి చేస్తూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఎవరూ ఆటలు ఆడడానికి అనుమతించకూడదని సమయ పరిమితులను విధించాయి. 

గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ప్లే గేమ్స్‌ 24 ప్లస్‌ 7 ప్రైవేట్‌ లిమిటెడ్, హెడ్‌ డిజిటల్‌ వర్క్స్, ఎస్పోర్ట్‌ ప్లేయర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, ఇతరుల తరఫున మద్రాసు హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను విచారించిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సుబ్రమణ్యం, జస్టిస్‌ కె.రాజశేఖర్‌లతో  కూడిన ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది.

రమ్మీ, పోకర్‌ వంటి జూదం ఆటలు ప్రజలకు ముప్పు కలిగిస్తున్నందున ఆన్‌లైన్‌ ఆటలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తీర్పులో పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వ నియమాలు కేంద్ర ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా లేవు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఆన్‌లైన్‌ గేమ్‌ల ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ నియంత్రణ నియమాలు తక్షణ అవసరంగా మారాయని తెలిపింది. అలాగే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఆధార్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని హైకోర్టు ఆదేశించింది.  

Advertisement
 
Advertisement
Advertisement