రేపు నా పెళ్లి అంటూ లవర్‌కు ఫోన్‌.. ఆ తర్వాత సూపర్‌ ట్విస్ట్‌

Lover Crashes Girlfriend Wedding At Bihar - Sakshi

వారిద్దరూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంతలో ప్రియురాలి ఫ్యామిలీ ఆమెకు మరోకరితో పెళ్లి నిశ్చయించారు. దీంతో, లవర్‌ను ఆమె తన పెళ్లికి రావాలని కోరింది. ఈ క్రమంలో పెళ్లి మండపానికి వచ్చి లవర్‌ చేసిన పనికి అతిథులంతా షాకయ్యారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. నలందలోని ముబారక్‌పూర్‌ గ్రామానికి చెందిన ముఖేశ్‌, వధువు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెకు మరొకరితో పెళ్లికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన ప్రియుడికి ఆమె ఈ విషయం చెప్పింది. తన పెళ్లికి రావాలని.. అక్కడ ఏం చేయాలో వారిద్దరూ ముందే ప్లాన్‌ చేసుకున్నారు. 

కాగా, మంగళవారం వివాహం జరగుతుండగా ముఖేశ్​ పెళ్లికి వచ్చాడు. వధువరూలు దండలు మార్చుకుంటుండగా వేదికపై వచ్చి.. వధువు మెడలో దండ వేసి బొట్టు పెట్టాడు. అనంతరం ఆమెను కౌగిలించుకున్నాడు. ఈ సందర్భంగా తాము ప్రేమించుకుంటున్నామని అన్నాడు. మా విషయం వారి ఇంట్లో తెలియడం వల్ల పెళ్లి నిశ్చయించారు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరిందని తెలిపాడు. అందుకే పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. కాగా, వధువు కుటుంబ సభ్యులు మాత్రం.. ముఖేశ్‌ చెప్పేవన్నీ అబద్ధం అంటూ కొట్టిపారేశారు. 

మరోవైపు.. పెళ్లి మండపంలో ఇంత జరుగుతున్నా.. వరుడు మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాడు. అనంతరం.. పెళ్లి చేసుకోకుండానే మండపం నుంచి వెళ్లిపోయాడు. అయితే, ముఖేశ్‌ ఇలా చేసిన తర్వాత.. వధువు కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. వారి దాడిలో ముఖేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై వధువు పేరెం‍ట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top