
సక్తి: ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి నలుగురు కూలీలు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. దబ్రా ప్రాంతం పరిధిలోని ఉచ్చపిండా గ్రామంలో ఆర్‌కేఎం పవన్‌జెన్ ప్లాంట్‌లో ఈ ఘటన జరిగిది.
10 మంది కార్మికులు తమ షిఫ్ట్ ముగించుకుని లిఫ్ట్‌లో దిగుతున్న సమయంలో లిప్ట్ అకస్మాత్తుగా కింద పడిపోయిందని ఎస్పీ అంకితా శర్మ వెల్లడించారు. గాయపడినవారిని రాయ్‌గఢ్‌లోని జిందాల్ ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారని తెలిపారు. ఆరుగురికి వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు.