ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త!

LIC Eases Policy Claim Settlement Process - Sakshi

భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశంలోని సమీప ఎల్ఐసి కార్యాలయంలో ఎక్కడైనా జమ చేయవచ్చని మార్చి 18న ప్రకటించింది. ఎల్ఐసీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. "పాలసీ హోమ్ బ్రాంచ్ తో సంబంధం లేకుండా, మెచ్యూరిటీ చెల్లింపులు చెల్లించాల్సిన పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ 113 డివిజనల్ కార్యాలయాలు, 2048 శాఖలు, 1526 ఉప కార్యాలయాలు, 74 కస్టమర్ జోన్లలో సమర్పించవచ్చు అని తెలిపింది. అయితే, వాస్తవానికి క్లెయిమ్ ప్రాసెస్ హోమ్ బ్రాంచ్ ద్వారా మాత్రమే చేయబడుతుంది. ఎల్ఐసీ ఆల్ ఇండియా నెట్‌వర్క్ ద్వారా పత్రాలు డిజిటల్‌గా బదిలీ చేయబడతాయి" అని పేర్కొంది. 

ఈ సదుపాయం వల్ల పాలసీదారుడు ఒక నగరంలో ఉన్న అతని పాలసీ పత్రాలు మరొక నగరంలో సమర్పించాల్సి ఉంటే, తన పత్రాలను దగ్గరలోని ఎల్ఐసీ శాఖలో సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎల్ఐసీ కార్యాలయాల్లో అధికారులకు ఈ అధికారం ఇవ్వబడింది. ఒక ఎల్ఐసీ పాలసీదారుడు ఈ విషయంలో సహాయం కోసం అధీకృత అధికారిని కూడా అడగవచ్చు. ఈ సదుపాయం ట్రయల్ ప్రాతిపదికన 2021 మార్చి 31 వరకు లభిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పెరుగుతున్న కారణంగా పాలసీదారులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. గత ఏడాది కూడా కరోనా మహమ్మారి వచ్చిన కొత్తలో ఎల్ఐసీ మెచ్యూరిటీ క్లెయిమ్ ప్రాసెస్ కోసం వినియోగదారులకు ఈ అవకాశం కల్పించింది. లాక్డౌన్ కారణంగా ఎల్ఐసీ తన పాలసీదారులకు మెచ్యూరిటీ క్లెయిమ్ సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అనుమతించింది.

చదవండి:

ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top