కోల్‌కతా డీసీ నివాసంపై  ఈడీ దాడులు | Kolkata Deputy Police Commissioner Home Raided In Money Laundering Case | Sakshi
Sakshi News home page

కోల్‌కతా డీసీ నివాసంపై  ఈడీ దాడులు

Apr 20 2026 6:28 AM | Updated on Apr 20 2026 6:28 AM

Kolkata Deputy Police Commissioner Home Raided In Money Laundering Case

వ్యాపారవేత్త అరెస్టు, విచారణ

కోల్‌కతా: మనీలాండరింగ్‌ విచారణలో భాగంగా కోల్‌కతా పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ శంతను సిన్హా బిస్వాస్‌తో పాటు జాయ్‌ కామ్దార్‌ అనే వ్యాపారవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఆదివారం దాడులు చేసింది. దాడుల సమయంలో బిస్వాస్‌ అందుబాటులో లేరు. కామ్దార్‌ను విచారణ నిమిత్తం స్థానిక ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అరెస్టు చేశారు. 

రాష్ట్రంలో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ నేపథ్యంలో ఈ దాడులు, అరెస్టు చర్చనీయాంశమయ్యాయి. కేసులో ఏప్రిల్‌ 1న ఈడీ మొదటి విడత సోదాలు నిర్వహించింది.  రూ. 1.47 కోట్ల నగదుతో పాటు రూ. 67.64 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్ట ఉల్లంఘనల అభియోగాలతో కోల్‌కత్తా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement