రూ.5.5 కోట్ల కిడ్నాప్‌ కేసు.. ప్రత్యక్ష సాక్షిగా అంధుడు

Kidnap Case UP Police Made Blind As Eye Witness And Statement Record - Sakshi

యూపీ పోలీసుల తీరుపై విమర్శలు

విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలీసుల పని తీరుపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. మీలాంటి అధికారులుంటే.. మా జీవితాలు బాగుపడ్డట్లే అని విమర్శిస్తున్నారు. పోలీసులపై ఇంత భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణం ఏంటంటే ఓ కిడ్నాప్‌ కేసులో పోలీసులు అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. దీనిపై జనాలతో పాటు.. విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాలు...
(చదవండి: రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు)

కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ మీరట్‌ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్యామ్‌నగర్‌కు చెందిన మాంసం వ్యాపారి హాజీ ఆస్‌ మహ్మద్‌ అనే వ్యక్తిని అతడి బంధువులు హాజీ అన్సార్‌, అన్వర్‌లు మోసం చేశారు. మాంసం వ్యాపారం సాకుతో అతడి వద్ద నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు కానీ పని చేయలేదు. ఈ క్రమంలో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా హాజీ నిందితులను కోరాడు. వారు అంగీకరించకపోగా.. అతడిపై దాడి చేసి.. కిడ్నాప్‌ చేస్తామని బెదిరించారు. దాంతో హాజీ ఆస్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుల మీద దాడి, కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. 
(చదవండి: ఒమిక్రాన్‌ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్‌!)

మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ కేసులో ఓ అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. అతడి స్టేట్‌మెంట్‌ కూడా రికార్డ్‌ చేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఎలా.. అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొని.. తమకు కళ్లు లేవని పోలీసులు నిరూపించుకున్నారు అని దుయ్యబట్టారు. వివాదం కాస్త పెద్దది కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. 

చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top