గవర్నర్‌ ఉత్తర్వులపై కేరళ సీఎం ఫైర్‌

Keralas Pinarayi Vijayan Slams Governors Latest Order - Sakshi

బెంగళూరు: కేరళలో తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30 గంటల కల్లా వైదొలగాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక పాలక ప్రభుత్వం గవర్నర్‌ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు దాఖలైన పిటీషన్‌ పరిశీలించేందుకు సోమవారం సాయంత్రమే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఐతే గవర్నర్‌ ఖాన్‌ సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ... విశ్వవిద్యాలయా వైస్‌ ఛాన్సలర్‌లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెబుతున్నారు.

దీంతో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే మాతో ఇలా యుద్ధానికి దిగుతున్నారంటూ గవర్నర్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విరుచుకుపడ్డారు. సంఘ పరివార్‌కి ధీటుగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలను కాలరాసేలా గవర్నర్‌ తన చర్యలను అతిక్రమిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు వీసీలను సొంతంగా నియమిస్తున్న నేపథ్యం ఉందని, కానీ గవర్నర్‌ ఇది తన బాధ్యత అంటూ వాదిస్తున్నారని అన్నారు. అయినా గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడానికో లేదా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికో కాదని స్పష్టం చేశారు. అంతేగాదు గవర్నర్‌కు అలాంటి దిశానిర్దేశం చేసే అధికారం లేదని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి కూడా కరాఖండీగా చెప్పారు.  ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనదంటూ విమర్శలు గుప్పించారు. విద్యాసంస్థల్లో హిందూత్వ భావజాలన్ని ప్రచారం చేయాలన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. 

(చదవండి: దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top