ఎటు చూసినా నీరే.. ఒళ్లంతా బురద.. బస్సు టైరే ఆధారం.. వీడియో తీస్తున్న కండక్టర్‌ ఒక్క ఉదుటున..

Kerala Rains: Man And Son Clinging To KSRTC Bus Wheel Rescued By Conductor Video Goes Viral - Sakshi

తిరువనంతపురం: గత నాలుగు రోజులుగా దంచికొడుతున్న వానలతో కేరళలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇడుక్కి, కొట్టాయంలో కొండ చిరియలు విరిగిపడటంతో దాదాపు 26 మంది ప్రాణాలు విడిచారు. మట్టిలో కూరుకుపోయారని భావిస్తున్న 12 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఈక్రమంలోనే రాష్ట్రంలో వరదల ఉధృతిని తెలియజేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భారీ వరద, బురద కారణంగా కేరళ ఆర్టీసీకి చెందిన బస్సు, మరికొన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో వాటి పక్కనే ఓ వ్యక్తి, అతని కొడుకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా బస్సు టైర్‌ని పట్టుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు యత్నిస్తుంటారు. ఒంటినిండా బురద, మట్టితో హాహాకారాలు చేస్తుంటారు.
(చదవండి: ప్యాలెస్‌లోనే ఉంటా .. మొండికేసిన గజరాజు అశ్వత్థామ)

గుజరాత్‌ వ్యక్తి, అతని భార్య పిల్లలను రక్షించిన కేరళ ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు

అదే సమయంలో బస్సులో నుంచి వరద దృశ్యాల్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న కండక్టర్‌ జైసన్‌ జోసెఫ్‌ వెంటనే స్పందించి ఒక్క ఉదుటున అక్కడకు చేరుకుని, తోటి సిబ్బంది సాయంతో వారిని అతి కష్టమ్మీద వరదలో కొట్టుకుపోకుండా రక్షిస్తారు. తర్వాత బస్సుకు కొద్ది దూరంలో కారులో ఉన్న ఆ వ్యక్తి భార్య, మరో చిన్నారిని కూడా మిగతావారి సాయంతో రక్షించి బస్సులోకి చేరుస్తాడు.

వరద బాధితులు గుజరాత్‌కు చెందినవారిగా కండక్టర్‌ జోసెఫ్‌ తెలిపారు. వరద ఎక్కువ కావడంతో కారులో నుంచి బయటపడే క్రమంలో ఆ తండ్రీ కొడుకులిద్దరు ప్రమాదం అంచుల వరకు చేరారని పేర్కొన్నాడు. ఇడుక్కి జిల్లాలోని పుల్లుపురలో ఈ ఘటన జరిగింది.
(చదవండి: Viral Video: ‘వ్యాక్సిన్‌ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top