వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ ..

సరదా, డ్యాన్స్, కామెడీ, ఫ్రంక్ వీడియోలకు సోషల్ మీడియా నిలయంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. వీటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరిన్ని థ్రిల్ చేస్తుంటాయి. ఇక తాజాగా కేరళకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిని మిని నాయర్ అనే యువతి తన ట్విటర్‌లో షేర్ చేయడంతో రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చదవండి: తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు!
ఈ వీడియోలో పదుల సంఖ్యలో యువతులు ఒక్కచోట చేరి అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. యువతులందరూ సంప్రదాయబద్దంగా చీరలు కట్టుకొని చూడముచ్చటగా రెడీ అయ్యి పాటకు స్టెప్పులేశారు. వాస్తవానికి ఈ వీడియో 2019 ఓనమ్ పండగకు ముందు ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజీ విద్యార్థులు చేసిన డ్యాన్స్‌కు చెందినది. కేరళలోని త్రిస్సూర్ పూరం ఆలయ జాతరకు సంబంధించిన ‘కంత నింజానుం వరం’ డ్యాన్స్. దీనిని చూసిన నెటిజన్లు.. పాట అర్థం కాలేదు కానీ యువతుల్లో ముఖాల్లో ఆనందం, ఉత్సహం వెలిగిపోతుందని కామెంట్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతికి కేరళ పుట్టినిల్లు అని ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు.
చదవండి: ‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది
Hope springs eternal.
We can.
Keralam. A song on the fabled Thrissur Pooram!#home
H/t @phenomenon75 pic.twitter.com/bdGAIhMy7s— Mini Nair (@minicnair) September 25, 2021