అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..

Mother Bear Teaching Her Cub To Use The Slide At School Playground - Sakshi

పిల్లల్ని ఆటస్థలంలో వదిలేస్తే వాళ్ల ఆటలకి హద్దే ఉండదు. ఎగరడాలు, దూకడాలు, జారడాలు.. ఒకటేమిటి అన్నీ చేస్తారు. అయితే  పిల్లలే కాదు మాకు ఆటలంటే సరదానే అని ఒక ఎలుగుబంటి దానిపిల్ల ఆడి మరీ నిరూపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అవి ఎలా ఆడుకున్నాయో మీరే చూడండి.

ఈ వీడియోలో అమ్మ ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి ఎలా వచ్చాయోగానీ స్కూల్‌ ప్లే గ్రౌండ్‌లోకి రావడం కనిపిస్తుంది. వాటికి అక్కడి ఆట స్థలంలో స్లైడ్‌ కనిపించింది. ఇంకేముంది. తల్లి ఎలుగుబంటి ఎక్కి కూర్చుంది. పాపం ఎలుగుబంటి పిల్లకు మాత్రం ఏం చేయాలో ఎలా ఆడాలో తెలియక తికమక పడిపోతూ అటూఇటూ తిరుగుతుంటే పైన కూర్చున్న అమ్మ ఎలుగుబంటి పెద్ద స్లైడ్‌లో నుంచి సర్రుమని జారి కిందికి వచ్చింది. ఇదిగో ఇలా జారాలని చెప్పినట్టు పిల్ల ఎలుగుబంటికి అర్థమైంది. వెంటనే తను కూడా చిన్న స్లైడ్‌లో నుంచి జారి కిందికి వచ్చింది. ఇక తల్లి పిల్ల ఒకదానిపై ఒకటి పడి సరదాగా  ఆడుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. 

దీనిని నార్త్ కరొలినాలోని ఇస్సాక్‌ డెక్సన్‌ ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌ బెట్సీ స్టాక్‌ స్లేగర్‌ ఫేస్‌ బుక్‌లో ‘దిస్‌ మేడ్‌ మై డే - ప్లే గ్రౌండ్‌ ఎట్‌ స్కూల్‌.. వాచ్‌ ది హోల్‌ థింగ్‌!! క్యప్షన్‌తో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో విపరీతంగా షేర్‌ కావడమేకాకుండా వందల్లో కామెంట్లు వచ్చాయి.

ఈ కొంటె ఎలుగుబంట్లను ప్రేమిస్తున్నానని ఒకరు, ఇవి రెండూ సరదాగా ఆడుకుంటున్న దృశ్యం చూడటానికి చాలా బాగుందని మరొకరు కామెంట్‌ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 

చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top