కేరళ: మరోసారి లెఫ్ట్‌ ప్రభుత్వం..

Kerala Assembly Election Results 2021: Live Updates In Telugu - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌:

► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్‌డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు.

► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు

► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్  చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు.

మెట్రోమాన్‌ ఈ శ్రీధరణ్‌కు షాక్‌...!
► మెట్రోమాన్‌ ఈ శ్రీధరణ్‌కు షాక్‌ తగిలింది. పాలక్కడ్‌ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే షఫి పరంబిల్‌ (కాంగ్రెస్‌) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్‌ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్‌ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.

► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు.

► కేరళలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అధికార ఎల్‌డీఎఫ్‌ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌డీఎఫ్‌ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35  లీడ్‌లో ఉంది.

► ఎల్‌డీఎఫ్‌ 70 , యూడీఫ్‌ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి.  అదేవిధంగా ఎల్‌డీఎఫ్‌ 26, యూడీఫ్‌ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

 త్రిశూర్‌లో బిజేపీ అభ్యర్థి సురేష్‌ గోపి ముందంజలో ఉ‍న్నారు.

►  రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్‌ ప్రభుత్వం..

► పినరయి విజయన్‌దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు..

► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్‌ ఆధిక్యం

► పుత్తుపల్లిలో ఊమెన్‌ చాందీ చాంది ఆధిక్యం

► కేరళలో పాలక్కడ్‌లో మెట్రోమాన్‌ శ్రీధరన్‌ ముందంజ..

► కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య హోరాహోరీ
    ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్‌(CPM)
    పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్‌ చాందీ(కాంగ్రెస్‌)
    కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్‌(బీజేపీ)

 కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్‌డీఎఫ్.. 
    ఎల్‌డీఎఫ్‌ 78 , యూడీఎఫ్‌ 48 

► కేరళలో తొలి రౌండ్‌లో ఎల్‌డీఎఫ్‌ ఆధిక్యం..
     ఎల్‌డీఎఫ్‌ 68, యూడీఎఫ్‌ 47 

 కేరళలో ఎల్‌డీఎఫ్‌ ముందంజ
    ఎల్‌డీఎఫ్‌ 33, యూడీఎఫ్‌ 18 చోట్ల ఆధిక్యం

► కేరళలో ఎల్‌డీఎఫ్‌ ముందంజ
    ఎల్‌డీఎఫ్‌ 14, యూడీఎఫ్‌ 9 చోట్ల ఆధిక్యం
 కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు  ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు  ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్‌ రిపోర్టు లేదా డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top