కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌ | Kedarnath Yatra stopped due to heavy rain in Uttarakhand | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

Jun 26 2023 5:49 AM | Updated on Jun 26 2023 5:49 AM

Kedarnath Yatra stopped due to heavy rain in Uttarakhand - Sakshi

రుద్రప్రయాగ: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సోనప్రయాగ్‌ దగ్గర యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కేదార్‌నాథ్‌కు ప్రయాణాల్ని ఆపేయాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement