కుక్క యవ్వారం.. రాళ్లతో కొట్టుకొని..

Karnataka: Man Hit With Stone After His Dog Urinates On Car - Sakshi

బనశంకరి(కర్ణాటక): కారుపై కుక్క మూత్రం పోయడంతో కారు యజమాని కుక్క యజమానిని రాయితో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాణసవాడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గాయపడ్డ బాధితుడు, హెచ్‌ఏఎల్‌ విశ్రాంత ఉద్యోగి గేరి రోజారియా. ఇతని పెంపుడు కుక్క ఎదురింటి వద్దనున్న చాల్స్‌ అనే వ్యక్తి కారుపై ఆదివారం రాత్రి 11 గంటలప్పుడు మూత్రం పోసింది. దీంతో చాల్స్‌– గేరి కుటుంబాల మధ్య గలాటా మొదలైంది. చాల్స్‌ పెద్ద రాయి తీసుకుని గేరి ముఖంపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఫిర్యాదు మేరకు చాల్స్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరో ఘటనలో..

పాలికె నోటీసులతో దడ  
బనశంకరి: బెంగళూరులో నిబంధనలను ఉల్లంఘించి కట్టడాలు నిర్మించిన యజమానులకు ఇటీవల బీబీఎంపీ నోటీసులు జారీచేసింది. తమ ఇళ్లు, భవంతుల ప్లానింగ్‌ అనుమతి పత్రాలను అందజేయాలని నోటీసులు అందుతున్నట్లు కొందరు తెలిపారు. బీ– ఖాతా స్థలాల్లో నిర్మించిన కట్టడాలను బీబీఎంపీ అక్రమ కట్టడాలుగా పరిగణిస్తుంది. ట్రినిటీ ఎస్కేప్‌ నివాసుల ఒక్కోట అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడుతూ గత వారం హŸరమావులో 100 కు పైగా ఇళ్లకు నోటీసులు అందాయన్నారు. మూడురోజుల్లోగా రికార్డులను చూపాలని ఉందన్నారు. మేము స్థలం కొనుగోలు చేసినప్పుడు బీ –ఖాతా స్థలాలను మార్చలేదన్నారు. రిటైరైన డబ్బులతో స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నామని, పాలికె ఆదేశాలతో నిద్ర రావడం లేదని వాపోయారు.  

చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top