కరోనా బారినపడ్డ కర్ణాటక సీఎం.. ఢిల్లీ పర్యటన రద్దు..

Karnataka CM Bommai Tests Covid Positive - Sakshi

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

గత కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా తక్షణమే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తనకు కరోనా సోకడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే బొమ్మై జులై 25, 26న ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన వివిధ శాఖల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్‌గా తేలడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది.
చదవండి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన.. మోహన్‌ మార్కం, ఎందుకంటే?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top