గ్రామపెద్ద సరేనంటేనే క్షవరం 

Karnataka: Barbers Refuse To Cut Hair Of People From SC Community - Sakshi

సాక్షి, యశవంతపుర: దళితులకు క్షవరం చేయబోమనడంతో గొడవ ఏర్పడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా ధళెహళె గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం దురాచారం అమలవుతోంది. ఓ క్షౌరశాలలో క్షవరం కోసం కొందరు దళితులు రాగా, క్షురకుడు అన్నప్ప గ్రామ పెద్ద సరేనంటే మీకు క్షవరం చేస్తానని చెప్పాడు.

మాకు ఎందుకు క్షవరం చేయవు అని దళిత యువకులు ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్‌ మీడియాలో రావడంతో శనివారం చర్చనీయాంశమైంది. సంఘటనపై జిల్లాస్థాయి అధికారులు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో దళితులను ఆలయాల్లోకి అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top