అత్యాచారం చేసి చంపుతామని బెదిరింపులు

Journalist Rohini Singh Got Murder Threats: Law Student Arrested - Sakshi

జైపూర్‌: ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్ట్‌ను అత్యాచారం చేసి చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డ సదరు వ్యక్తిని రాజస్తాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు రోడ్లెక్కిన విషయం తెలిసిందే. రోహిని సింగ్‌ అనే పాత్రికేయురాలు వారి ఆందోళనను రిపోర్టింగ్‌ చేసింది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న 26 ఏళ్ల కపిల్‌ సింగ్‌కు ఆమె రిపోర్టింగ్‌ నచ్చలేదు. దీంతో సదరు పాత్రికేయురాలిపై బెదిరింపులకు దిగాడు. అత్యాచారం చేసి ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. దీంతో రోహిని అతడి మీద చర్యలు తీసుకోమని కోరుతూ ఉదయ్‌పూర్‌ పోలీసులు, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను ట్యాగ్‌ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉదయ్‌పూర్‌లోని సెమారీకి చెందిన కపిల్‌ను అరెస్ట్‌ చేశారు. (చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top