జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

JEE Advanced 2020 Results Released - Sakshi

న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష- 2020 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ సోమవారం వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ jeeadv.ac.inలో విద్యార్థులు రిజల్ట్స్‌ చూసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించే ఈ పరీక్షకు లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్‌-1కు 1,51,311 మంది హాజరు కాగా, 1,50,900 మంది పేపర్‌ 2 పరీక్ష రాశారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో  352/396 స్కోర్‌ సాధించిన చిరాగ్‌ ఫలోర్‌ టాపర్‌గా నిలవగా, 315 మార్కులు సాధించిన కనిష్క మిట్టల్‌ బాలికల్లో ప్రథమ స్థానం సంపాదించారు. కాగా ఈనెల 6 (మంగళవారం) నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు జోసా ఏర్పాట్లు చేసింది.

ర్యాంకర్లకు అభినందనలు
తాము అనుకున్న ర్యాంకులు సాధించిన వారికి కేంద్ర విద్యాశాక మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంఖ్‌ అభినందనలు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారు భవిష్యత్తులో ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. పరీక్షలను విజయవంతం నిర్వహించిన ఐఐటీ-ఢిల్లీని ప్రత్యేకంగా మంత్రి అభినందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top