అభిమాని అభ్యర్థణకు మోదీ రిప్లై.. చెక్కెర తగ్గించండి..! | Influencer urges PM Modi to curb his father's sugar consumption | Sakshi
Sakshi News home page

అభిమాని అభ్యర్థణకు మోదీ రిప్లై.. చెక్కెర తగ్గించండి..!

Mar 21 2026 10:20 AM | Updated on Mar 21 2026 10:52 AM

Influencer urges PM Modi to curb his father's sugar consumption

సోషల్ మీడియాలో ‍ప్రధాని మోదీకి, తన వీరాభిమాని కుమారునికి మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి ప్రధాని మోదీకి వీరాభిమాని అని ఆయన చెబితే తను చెక్కెర తినడం మానేస్తాడని ఒక సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ప్రధానిని ఇన్‌స్ట్రాలో వీడియో చేస్తూ అభ్యర్థించారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

యువరాజ్‌ దువా అనే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రధాని మోదీని అభ్యర్థించారు. "ప్రధాని మోదీ గారు మా తండ్రి గారు మీకు వీరాభిమాని ఆయన చెక్కెర అధికంగా తింటాడు. దయచేసి మీరు అతనిని షుగర్ తినడం మానిపించాలి. మీరు చెబితే ఆయన వింటారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్యా దయచేసి ఆయనను చెక్కెర తినడం మానిపించండి" అని ఇన్‌స్ట్రా రీల్ చేశారు.

ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి ప్రధాని  దృష్టికి చేరింది. దీంతో మోదీ తన అధికారిక ఇన్‌స్ట్రా అకౌంట్‌లో దీనికి రిప్లై ఇచ్చారు. " యువరాజ్ అభ్యర్థన మేరకు నేను తన తండ్రిని షుగర్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనతో పాటు ఇతరులు కూడా అలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెక్కెర అధికంగా తీసుకోవడం అనేక వ్యాధులకు, ఉభకాయానికి కారణం అవుతుంది. యోగా మీ జీవితంలో భాగం చేసుకొవడం ద్వారా ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండవచ్చు. అని మోదీ ఇన్‌స్ట్రాలో రిప్లై ఇచ్చారు. అనంతరం అతని వీడియో రీషేర్ చేశారు.

అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రధాని  మీ వీడియో షేర్ చేశారని తెలిస్తే మీ తండ్రి చాలా గర్వంగా ఫీలవుతారని ఒకరు కామెంట్ చేశారు. ఇలా ఇన్‌స్ట్రాలో చాలా మంది యువరాజ్‌ దువాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే  భారత ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య 10 కోట్లు దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement