వాటిని వాడే వారిపై ఎలాంటి జరిమానాలుండవు

Individuals using Banned Chinese Apps will not be Penalized - Sakshi

న్యూఢిల్లీ: గత కొద్దీ నెలల క్రితం టిక్ టాక్, పబ్జి వంటి మరెన్నో పేరొందిన చైనీస్ యాప్ లను ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. కానీ, ఆ యాప్ అభిమానులు వాటిని యాక్సెస్ చేయడం కోసం ఇతర ఏపీకే లింకుల ద్వారా వాటిని మొబైల్ ఫోన్లలో ఇంస్టాల్ చేసుకొని వాడుతున్నారు. చట్టవిరుద్ధంగా ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారంటూ సమాచార హక్కు చట్టం కింద కొందరు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిషేధిత యాప్‌ల వినియోగానికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వ్యక్తులపై ఎటువంటి జరిమానా, శిక్షలు విధించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఐటి చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద గుర్తించబడిన మధ్యవర్తులు(సంస్థల)పై మాత్రమే ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు గాను జరిమానా విధించనున్నట్లు కేంద్రం పేర్కొంది.(చదవండి: మరోసారి తన సత్తా చాటిన షియోమీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top