36,083 కరోనా కొత్త కేసులు

India reported 36,083 new Covid-19 cases in 24 hours - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఆదివారం 36,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,21,92,576కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,85,336కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.20 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 493 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,225కు చేరుకుంది. శనివారం 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 1.88గా నమోదైంది. దేశంలో నేటికి 49,36,24,440 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.46గా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద 54.38 కోట్ల డోసుల టీకాలు వేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top