Corona Cases in India: కరోనా విస్ఫోటం

India adds 3,92,488 new cases and 3,689 fatalities in last 24 hour - Sakshi

దేశంలో కొత్తగా 3,92,488

కరోనా పాజిటివ్‌ కేసులు

రికార్డు స్థాయిలో 3,689 మంది కోవిడ్‌ బాధితులు మృతి

టాప్‌–50 దేశాల్లోని పాజిటివ్‌ కేసుల కంటే భారత్‌లో ఎక్కువ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య దేశంలోని భయానక పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,92,488 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 1,95,57457కు పెరిగింది. కరోనా సంక్రమణ కొత్త కేసులలో 73.71 శాతం 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. 76 శాతం మరణాలు ఈ 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి.

శనివారం గణాంకాలతో పోలిస్తే పాజిటివ్‌ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో చికిత్సతో కరోనా వైరస్‌ నయం చేసుకున్న వారి సంఖ్య 3,08,522కు చేరింది. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 33 లక్షలను దాటేశాయి. గత 24 గంటల్లో, కరోనా కారణంగా రికార్డు స్థాయిలో 3689 మంది మరణించారు.మహారాష్ట్రలో 802 మంది, ఢిల్లీలో 412, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 304, ఛత్తీస్‌గఢ్‌లో 229, కర్ణాటకలో 271, గుజరాత్‌లో 172, రాజస్తాన్‌లో 160, ఉత్తరాఖండ్‌లో 107, పంజాబ్‌లో 138, తమిళనాడులో 147 మంది మరణించారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 2,15,542కు పెరిగింది. 

ప్రతీరోజు లక్షల్లో కొత్త రోగుల సంఖ్య పెరగడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య ఆదివారం 33,49,644కు పెరిగింది. మొత్తం వైరస్‌ సోకిన వారిలో ఇది 17.06 శాతం. అయితే రోగుల రికవరీ రేటు 81.84 శాతానికి తగ్గింది. దేశంలో సంక్రమణ తర్వాత కోలుకున్న వారు 1,59,92,271కు పెరిగారు.

మరణాల రేటు 1.11%గా ఉం ది. ఢిల్లీలో కరోనా వినాశనం కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఢిల్లీలో సుమారు 25 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోం దనేది ప్రపంచవ్యాప్తంగా నమోదైన గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్‌ సోకిన టాప్‌–50 దేశాలలో శనివారం 3.91 లక్షల మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించగా భారత్‌లోనే 3,92,459 మంది రోగులను గుర్తించారు. అంటే మొత్తం 50 దేశాల కేసుల కంటే 1000మంది ఎక్కువ రోగులకు దేశంలో వైరస్‌ సోకింది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ మూడో దశతో కలిపి ఇప్పటిదాకా 15.68 కోట్లు కోవిడ్‌ టీకా డోసులు చేశారు. 18–44 ఏళ్ళ మధ్య ఉన్న వారిలో 11 రాష్ట్రాలలో మూడోదశ తొలిరోజు 86,023 మంది మొదటి డోస్‌ తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ (987), ఢిల్లీ (1,472), గుజరాత్‌ (51,622), జమ్మూకశ్మీర్‌ (201), కర్ణాటక (649), మహారాష్ట్ర (12,525), ఒడిశా (97), పంజాబ్‌ (298), రాజస్తాన్‌ (1853), తమిళనాడు (527), ఉత్తరప్రదేశ్‌ (15,792) రాష్ట్రాల్లో మొదటి డోస్‌ తీసుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top