కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. దీని పేరేంటో తెలుసా?

Ifs Officer Shares Rare Clouded Leopard Roaming Wild - Sakshi

అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న అరుదైన చిరత  ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్ల వావ్ అంటున్నారు. రాత్రివేళ అడవిలో సంచరిస్తున్న వన్యమృగం అత్యద్భుతంగా కన్పిస్తోంది. 

ఈ అరుదైన చిరుతను క్లౌడెడ్ లీపార్డ్ అంటారు. దీని చారలు మేఘాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ వన్యప్రాణులు అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయి. భారత్‌, నేపాల్‌ హిమాలయ పర్వత ప్రాంతం, ఇండోనేసియాలో మాత్రమే వీటి ఉనికి ఉంది.

ఈ క్లౌడెడ్ లీపార్డ్‌ల ఆహారపు అలవాట్లు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీని జీవన విధానం మిస్టరీగానే ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే ఇవి కన్పిస్తుంటాయి. దీని గోర్లు చాలా పదునుగా ఉంటాయి. ఇవి ఎత్తు తక్కువే అయినప్పటికీ అత్యంత శక్తమంతంగా ఉంటాయి. బ్యాలెన్స్ మెయింటెన్ చేయడానికి పొడవాటి తోకను కలిగిఉంటాయి. ఆడ క్లౌడెడ్‌ లీపార్డ్‌.. ఏడాదికి ఐదు పిల్లల వరకు జన్మనివ్వగలదు. పుట్టిన 10 నెలల వరకు మాత్రమే ఈ చిరుతలు తల్లిపై ఆధారపడతాయి. ఆ తర్వాత స్వయంగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి.
చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top