అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం

Himanta Biswa Sarma Takes Oath As A CM Of Assam State - Sakshi

గువాహటి:  బీజేపీ సీనియర్‌ నేత, నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కన్వీనర్‌ హిమంత బిశ్వ శర్మ అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్‌ జగదీశ్‌ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  హాజరయ్యారు. 

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం హిమంత కేబినెట్‌లో 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


 చదవండి: విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top