పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డ్! | Sakshi
Sakshi News home page

పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డ్!

Published Thu, Apr 22 2021 7:27 PM

Here is How To Get A New PAN Card In Just 10 Minutes - Sakshi

ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకునే సౌకర్యాన్ని ఆదాయపు పన్ను శాఖ కలిపిస్తుంది. గతంలో లాగా ఇప్పుడు ఈ-పాన్ కార్డు కోసం రెండు పేజీల్లో వివరాలు నింపి, కొద్దీ రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు తక్షణమే ఐటీ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఆధార్ కార్డు వివరాలు సమర్పించి పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకోవచ్చు. మరో ప్రయోజనకర విషయం ఏమంటే ఈ పాన్ కార్డు పూర్తిగా ఉచితం. అయితే ఇది ఈ-పాన్ నెంబర్. పీడీఎఫ్ రూపంలో దరఖాస్తుదారుడికి అందుతుంది. ఇప్పటివరకు పాన్ కార్డు లేని వారు దీనిని తీసుకోవడానికి అర్హులు. 

ఈ-పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ:

  • ట్యాక్స్ పేయర్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి లెఫ్ట్ సైడ్‌లోని క్విక్ లింక్స్ విభాగంలోని Instant PAN through Aadhaar పైన క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఇప్పుడు మీకు కనిపించే Get New PANపైన క్లిక్ చేయాలి.  
  • కొత్త పాన్ కార్డు కోసం మీ ఆధార్ నెంబర్, కాప్చా ఎంటర్ చేయాలి.  
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
  • ఓటీపీ, ఆధార్ వివరాలు ధృవీకరించాలి. 
  • పాన్ కార్డు అప్లికేషన్ కోసం మీ ఈ-మెయిల్ ఐడీని దృవీకరించాల్సి ఉంటుంది. 
  • ఆధార్‌తో ఈ-మెయిల్ అనుసంధానమై ఉంటే పాన్ పీడీఎఫ్ మెయిల్ రూపంలో వస్తుంది.

చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! 

Advertisement
 
Advertisement
 
Advertisement