Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం

Gyanvapi Masjid Case Varanasi Court Verdict - Sakshi

లక్నో: జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.  ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ తెలిపింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి.

ఇదీ కేసు..
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.  

ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్‌ సీల్డ్‌ కవర్‌లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది.
చదవండి: ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్‌ కేసులో కీలక పరిణామం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top