వాహనదారులకు కేంద్రం శుభవార్త!

Govt Extends Validity of Motor Vehicle Documents Till Sept 30 - Sakshi

వాహన పత్రాల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాహనదారులకు శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. "కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు" అని కేంద్రం ట్వీట్ చేసింది.

గత ఏడాది ఫిబ్రవరి 1 ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును సెప్టెంబర్ 30, 2021 నాటికి పొడగించింది. ఈ చర్య వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులను ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు, అభ్యర్థులు లైసెన్స్ కోసం ఆర్టివో కార్యాలయలలో డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వచ్చేది. కొత్త నిబందనల ప్రకారం, ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

చదవండి: కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్ మరీ ఇంత ఖరీదా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top