బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు: ప్రధాని మోదీ

Gen Bipin Rawat Worked Hard to Make Indias Forces Self Reliant - Sakshi

న్యూఢిల్లీ: దేశసైన్యం స్వయం సమృద్ధి సాధించేదిశగా సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో రూ.9,800 కోట్లతో చేపట్టిన సరయూ నహర్‌ నేషనల్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. భారతదేశ తొలి సీడీఎస్‌ జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తునికి తీరని లోటు. అతను ధైర్యవంతుడు.

దేశంలోని సాయుధ బలగాలను స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డాడు, దీనికి దేశం సాక్షి' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాగా, 'భారతదేశం ప్రస్తుతం శోకసంద్రంలో ఉంది. అయితే దేశం సవాళ్లను అధిగమించి అభివృద్ధి దిశగా పనిచేస్తూనే ఉంటుంది. భారతీయులమైన మనం కష్టపడి పనిచేస్తాము. దేశం లోపల, దేశం బయట కూడా సవాళ్లను, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటాము. భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, సంపన్న దేశంగా తీర్చిదిద్దుతాం' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

చదవండి: ('పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకేం అన్యాయం చేశారు')

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top