గంభీర్‌కు మళ్లీ బెదిరింపులు.. వారంలో మూడోసారి..

Gautam Gambhir Receives Third Threat Email From ISIS Kashmir Probe Undergoing - Sakshi

సాక్షి, ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావటం కొనసాగుతున్నాయి. మరోసారి ఆదివారం కూడా ఆయనకు బెదిరింపు ఈ మెయిల్స్‌ రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్‌ శ్వేతా(డీసీపీ) ఏం చేయలేరు. పోలీసుల్లో కూడా మా గూఢచారులు ఉన్నారు’ అని ఉగ్రవాద సంస్థ ఐసీస్‌ కశ్మీర్‌ పేరుతో ఉన్న ఈ-మెయిల్‌ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో బెదిరింపులు రావటం ఇది మూడోసారి.

చదవండి: అఖిలపక్షం భేటీ: ‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’

దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. సైబర్‌ సెల్‌కు చెందిన స్పెషల్‌ టీం బెందిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. 23 నవంబర్‌ రోజు కూడా మొదటిసారి బెందింపులు వచ్చాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నమని డీసీపీ శ్వేతా చౌహాన్‌ తెలిపారు. ఆయన నివాసం వద్ద పోలీసు భద్రత పెంచామని పేర్కొన్నారు. గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top