భవిష్యత్‌లో మెజార్టీతో వస్తా

Gali Janardhan Reddy Says After 12 Years Stepping In Vidhan Sabha - Sakshi

శివాజీనగర: ప్రజల ఆశీర్వాదంతో 12 సంవత్సరాల తరువాత విధానసౌధలోకి కాలుపెడుతున్నాను. ఇప్పుడు ప్రజలు తనను ఒక్కడిని మాత్రమే గెలిపించి పంపారు. భవిష్యత్‌లో అధిక మెజార్టీతో విధాన సౌధకు వస్తానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు.

సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్నేళ్ల తరువాత మళ్లీ విధానసౌధలోకి ప్రవేశిస్తున్నాను. తమ పార్టీకి అనేక మంది ప్రజలు ఓటు వేశారు. వారి ఆశీర్వాదంతో విధానసౌధలోకి ప్రవేశించాను. ప్రజోపయోగ పనులకు తన మద్దతు ఉంటుంది. అసెంబ్లీలో ప్రజలకు అనుకూలమైన బిల్లు ప్రవేశపెట్టడంలో తన మద్దతు తప్పకుండా ఉంటుంది. ఎవరికి తన అవసరం ఉంటుందో వారికి తన మద్దతు ఇస్తానన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top