వధువుకు వింత బహుమతులు.. వరుడుని ఉతకడానికేనా?

Friends Given Bizarre Gifts To Bride In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఈ మధ్య పెళ్లిలో జరిగే నాటకీయ దృశ్యాలు సీరియల్స్‌ని మించి ఉంటున్నాయి. ఇక స్నేహితులు ఇచ్చే వింత బహుమతులు బంధువులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో వధువుకి ఇచ్చిన వింత బహుమతుల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అప్పడాల కర్ర (రోలింగ్ పిన్), చిమాటా (టాంగ్స్) వంటి వంటగదికి సంబంధించిన వస్తువులను కొంత మంది స్నేహితులు వధువుకు బహుమతిగా అందజేశారు.

అయితే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లు తెగ కామెంట్‌ చేస్తున్నారు. ఇక దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘స్నేహితులు కొత్త సంసారం ముందుకు సాగడానికి ఈ వస్తువులన్నింటినీ బహుమతిగా ఇచ్చారా లేదా వరుడుని ఉతకడానికా..’’ అంటూ చమత్కరించాడు.
 

(చదవండి: వైరల్‌: స్ప్రింటర్లను మించి కెమెరామెన్‌ పరుగో పరుగు..)

(చదవండి: ముంబైని ముంచెత్తిన వర్షాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top