Uttarakhand: పొంగిపొర్లుతున్న కాలువలోకి కారు.. నలుగురు దుర్మరణం | Four Dead Including Newborn As Car Plunges Into Canal, Watch Video Inside Went Viral | Sakshi
Sakshi News home page

Uttarakhand: పొంగిపొర్లుతున్న కాలువలోకి కారు.. నలుగురు దుర్మరణం

Jun 25 2025 1:05 PM | Updated on Jun 25 2025 1:43 PM

Four Dead Including Newborn as Car Plunges Into Canal

హల్ద్వానీ: భారీ వర్షాల నడుమ ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న కారు రోడ్డు పక్కన పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో నాలుగు రోజుల శిశువుతో సహా నలుగురు మృతిచెందారని స్థానిక పోలీసులు తెలిపారు.
 

ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.  కారు కాలువలో పడగానే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కారును కల్వర్టు కింద నుండి బయటకు తీశారు. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే ట్రెక్ మార్గంలో కొండచరియలు విరిగిపడి, ఇద్దరు యాత్రికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిద్దరి మృతదేహాలను శిథిలాల నుండి బయటకు తీశారు. ఇదేవిధంగా మహారాష్ట్రకు చెందిన ఒక యాత్రికుడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. 

ఇది  కూడా చదవండి: అభినందన్‌ను బంధించానన్న.. పాక్‌ ఆర్మీ అధికారి మృతి 

Advertisement
 
Advertisement
Advertisement