
మే 1, 2021 నుంచి భారత ప్రభుత్వం 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్ టీకాలను వేయడానికి అనుమతించింది. అప్పటికే 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి టీకా వేస్తున్నారు. టీకాలు వేసుకునేందుకు ప్రజలకు సహాయపడటానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు తమ సెర్చ్ ఇంజన్లలో టీకా కేంద్రాల గురించి సమాచారాన్ని చూపుతున్నాయి. నేడు, మరొక టెక్ కంపెనీ రేసులోకి వచ్చింది.
దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇప్పుడు మీ సమీపంలో ఉన్న టీకా కేంద్రాన్ని కనుగొనడానికి సహాయం చేయనుంది. ఈ సేవలను అందించడానికి, వాట్సాప్ ఇప్పటికే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తోంది. వాట్సాప్ ను ఉపయోగించి మీ సమీపంలో ఉన్న టీకాల కేంద్రాన్ని కనుగొనడానికి క్రింద ప్రక్రియలను అనుసరించండి.
Find your nearest vaccination center right here, through the MyGov Corona Helpdesk Chatbot! Simply type ‘Namaste’ at 9013151515 on WhatsApp or visit https://t.co/D5cznbq8B5. Prepare, don't panic! #LargestVaccineDrive #IndiaFightsCorona pic.twitter.com/qbfFlr5G0T
— MyGovIndia (@mygovindia) May 1, 2021
వాట్సాప్ తో సమీప కోవిడ్ టీకా కేంద్రాన్ని ఎలా కనుగొనాలి?
- మీ స్మార్ట్‌ఫోన్‌లో +919013151515 నంబర్‌ను సేవ్ చేయండి. ఇది భారత ప్రభుత్వానికి చెందిన మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు చెందినది.
- వాట్సాప్‌కు ఓపెన్ చేసి మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ ఖాతాను తెరవండి.
- వాట్సాప్‌లోని మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు “Namaste” పంపండి. ఇప్పుడు చాట్‌బాట్ కేంద్రం అందించే సేవల జాబితాను మీకు చూపుతుంది. ఈ సేవల జాబితా నుంచి ఒక ఎంపికను ఎన్నుకోమని అడుగుతుంది. మీరు “COVID టీకా - కేంద్రాలు మరియు ప్రామాణిక సమాచారం” గల మొదటి సేవను ఎంచుకోవాలి.
- ఇప్పుడు, “COVID టీకా - కేంద్రాలు మరియు ప్రామాణిక సమాచారం” ఎంచుకోవడానికి మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు “1” పంపండి. ఇప్పుడు మీకు మరొక జాబితాను చూపుతుంది. మొదటి సేవకు “COVID టీకా - కేంద్రాల సంబంధిత సమాచారం” అని పేరు కనబడుతుంది, దాన్ని ఎంచుకోవాలి.
- “COVID టీకా - కేంద్రాల సంబంధిత సమాచారం” ఎంచుకోవడానికి “1” ని మరోసారి మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు పంపండి. వాట్సాప్ చాట్‌బాట్ ఇప్పుడు మీ ప్రాంతం పిన్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతుంది.
- మీ పిన్ కోడ్‌ను మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు పంపండి. ఉదాహరణకు, మీ పిన్ కోడ్ 500089 అయితే, “500089” ను వాట్సాప్ చాట్‌బాట్‌కు పంపండి. మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ ఇప్పుడు మీ ప్రాంతంలో ఏదైనా ఉంటే ఆ టీకా కేంద్రాల జాబితాను మీకు చూపిస్తుంది.
దానితో పాటు, వాట్సాప్‌లోని మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ మీరు టీకా కోసం మీరే నమోదు చేసుకునే లింక్‌ను మీకు పంపుతుంది. దీని సహాయంతో కోవిడ్-19 టీకా కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
చదవండి: