Finance Minister Nirmala Sitharaman Admitted In Delhi AIIMS Hospital - Sakshi
Sakshi News home page

Nirmala Sitharaman Health: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక

Dec 26 2022 1:20 PM | Updated on Dec 27 2022 9:08 AM

Finance Minister Nirmala Sitharaman Admitted Delhi AIIMS Hospital - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చేరారు. అయితే ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

వైరల్‌ ఫీవర్, పొట్టలో ఇన్ఫెక్షన్‌ కారణంగానే నిర్మాలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారని అధికారులు పేర్కొన్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. 

నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారు. మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్‍పేయీ జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. కానీ ఆ మరునాడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు.
చదవండి: రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement