తాజ్‌ హోటల్ 'ఫ్రీ' ఆఫర్‌‌: ప్రేమికులను రారమ్మంటోందా?

Fact Check: Taj Not Offering Free Stay During Valentines Week - Sakshi

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. సోషల్‌ మీడియాలో ఇప్పటి నుంచే ఈ వాలంటైన్స్‌ డే సందడి స్టార్ట్‌ అయింది. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్లు ప్రియురాలికి ఏ గిఫ్ట్‌ ఇవ్వాలి? ఎక్కడకు తీసుకెళ్లాలి? అని ప్లానింగ్స్‌ వేస్తుండగా.. ఇంకా ఇప్పుడే ప్రేమలో దిగుతున్నవాళ్లు నచ్చిన అమ్మాయి మనసు ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమించినవాళ్లను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏం చేయాలా? అని గూగుల్‌ తల్లిని అడుగుతున్న క్రమంలో ఓ మెసేజ్‌ చాలామందిని ఆకర్షిస్తోంది. వాలంటైన్స్‌ డే సందర్భంగా తాజ్‌ హోటల్‌ మీకో బంపర్‌ ఆఫర్‌ ఇస్తోందంటూ యూత్‌ను ఊరిస్తోంది. (చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఎఫెక్ట్స్‌ అన్న బిల్‌గేట్స్‌?)


"ఇప్పుడే నేను తాజ్‌ గిఫ్ట్‌ కార్డ్‌ను గెల్చుకున్నాను. తద్వారా తాజ్‌ హోటల్‌లో ఏడు రోజుల పాటు ఉచితంగా ఉండే అవకాశం లభించింది. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి" అంటూ ఓ లింక్‌ కనిపిస్తోంది. దీన్ని క్లిక్‌ చేయగానే 'మీరు కరెక్ట్‌ గిఫ్ట్‌ బాక్స్‌ను ఎంపిక చేసుకుంటే తాజ్‌ హోటల్‌లో నివసించే ఛాన్స్‌ మీ సొంతం, గుడ్‌ లక్'‌ అని ప్రత్యక్షమవుతుంది. మళ్లీ ఓకే నొక్కగానే అక్కడ చిన్న ప్రశ్నలేవో అడుగుతుంది. వాటికి సమాధానం చెప్పిన వెంటనే స్క్రీన్‌ మీద పన్నెండు గిఫ్ట్‌ బాక్సులు ప్రత్యక్షమవుతాయి.

వీటిలో ఏదైనా క్లిక్‌ చేసినప్పుడు గిఫ్ట్‌ కార్డు గెలుచుకున్నారే అనుకోండి. దాన్ని ఓ ఐదు వాట్సాప్‌ గ్రూపులకు లేదా 20 మందికి షేర్‌ చేయమని అడుగుతుంది. అవన్నీ పూర్తి చేశాక కథ మళ్లీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇదో ఫేక్‌ మెసేజ్‌. ఈ వైరల్‌ మెసేజ్‌పై తాజ్‌ హోటల్‌ స్పందిస్తూ ప్రేమ జంటల కోసం తాము ఎలాంటి గిఫ్ట్‌ కార్డులు పంపించడం లేదని స్పష్టం చేసింది. కాబట్టి మీకు కనక ఆ మెసేజ్‌ ఎవరైనా ఫార్వర్డ్‌ చేస్తే తాజ్‌ హోటల్‌లో ఏడు రోజులు ఉచితంగా గడపొచ్చని కలల్లో తేలిపోకండి. అదంతా ఓ మోసమని ఇతరులకు తెలియజేయండి. (చదవండి: దంపతుల డ్యాన్స్‌.. మనసు దోచేయడం ఖాయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top