వలసలు, నిరాసక్తత

Election Commission brings remote voting for migrant workers - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి ఉపాధి కోసం వలసలు, పట్టణాల్లో, యువతలో నిరాసక్తత వంటి ఎన్నో కారణాలున్నా యని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సి బ్బంది, న్యాయం, ప్రజా సమస్యలపై పార్లమెంటు సంఘానికి ఈ మేరకు నివేదించింది. సోమ వారం జరిగిన సంఘం సమావేశంలో ఈ అంశంపై ఈసీ ఉన్నతాధికారులు ప్రజెంటేషన్‌ సమర్పించారు.

ఓటింగ్‌ శాతం పెంచేందుకు రిమో ట్‌ ఓటింగ్‌ సదుపాయం వంటివి అందుబాటులోకి తేవాలని సూచించారు. అయితే, ‘‘రిమోట్‌ ఓటింగ్‌ పరిజ్ఞానం కూడా నెట్‌వర్క్‌లకు అనుసంధానమయ్యే తరహాలో కాకుండా ఈవీఎంల మాదిరిగా స్వతంత్రంగా ఉండేలా చూడటం ముఖ్యం. అప్పుడే ఎలాంటి దుర్వినియోగానికీ తావుండదు’’ అని అభిప్రాయపడ్డారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top