రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! | Dog Caught Red Handed After Thiefing Lipstick | Sakshi
Sakshi News home page

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క!

Feb 10 2021 8:02 PM | Updated on Feb 10 2021 9:17 PM

Dog Caught Red Handed After Thiefing Lipstick - Sakshi

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కుక్క ఇదే!..

‘‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టడానికి సిగ్గులేదు’’.. ‘‘ దొంగతనం చేసి, అమాయకంగా ఫేస్‌ ఎలా పెట్టాడో చూడండి!’...

దొంగతనం చేసి, పట్టుబడ్డ ఓ కుక్క ఇప్పుడో సోషల్‌ మీడియా సెలెబ్రిటీ అయ్యింది. తను చేసిన దొంగతనంతో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వివరాలు.. డాక్టర్‌ సుల్భా కేజీ అరోరా అనే యవతి తన ట్విటర్‌ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్‌ చేసింది. ‘‘ నిన్న రాత్రి ఓ దొంగ డ్రెసర్‌లోంచి మా అమ్మ లిప్‌స్టిక్‌ను దొంగిలించుకుపోయాడు. అదృష్టం! ఆ దొంగను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’’ అని పేర్కొంది. కాళ్లకు లిప్‌స్టిక్‌ రంగుతో ఉన్న పెంపుడు కుక్క ఫొటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌ ఇప్పటి వరకు 2 వేలకుపైగా లైకులు సంపాదించుకుంది. ( లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్‌ )

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ తిన్నింటి వాసాలు లెక్కపెట్టడానికి సిగ్గులేదు’’.. ‘‘ దొంగతనం చేసి, అమాయకంగా ఫేస్‌ ఎలా పెట్టాడో చూడండి!’’.. ‘‘ఇలాంటి దొంగల్ని ఊరికే వదిలిపెట్టకూడదు.. గోడకుర్చీ వేయించాలి’’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే కుక్క వైపునుంచి డాక్టర్‌ సుల్భా కేజీ అరోరా స్పందిస్తూ.. ‘‘ నేను దొంగను పట్టుకుని లిప్‌స్టిక్‌ను స్వాధీనం చేసుకున్నా.. అందుకే నా పాదాలు ఎర్రగా అయ్యాయమ్మా..’’ అని కామెంట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement