
మన చుట్టూ ఉంటూ మనతో పాటు జీవాల్లో కుక్కలు, పిల్లలు, ఆవు, గేదె, ఎద్దు, మేకలు గొర్రెలు, ఇతర పక్షులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మన ఇంటిపెరటిలో, మొక్కల్లో ఎపుడూ చెంగు చెంగున తిరిగే బుల్లి ప్రాణి గురించి మనం ఇపుడు మాట్లాడుకోబోతున్నాం. అదేనండి... శ్రీరాముడి చేతిముద్రను వీపు మోస్తూ తిరిగే ఉడుత. దీనికి సంబంధిచి ఒక వీడియో ఒకటి నెట్టింట సందడిగామారింది.
ఉడుతలు కూడా పగబడతాయా అన్నట్టు ఉన్న వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఈ వీకెండ్ మూడ్‌లో సరదాగా మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేసేయండి. అయితే.. ఉడుతను తిట్టుకోకండి.. పాపం. బుజ్జి ఉడుత నవ్వుకోండి. ఎందుకంటే ఈ వీడియో ముందు కుక్క అక్కడ తిరుగుతున్న ఉడుతపై ఎగబడింది. దాంతో ఉడుతు ఏమనుకుందో ఏమోగానీ, అక్కడున్న మనిషిపై ఒక్కసారిగా దూకి నానా హంగామా చేసింది. ఆ తరువాత వదల బొమ్మాళి అన్నట్టు కుక్కను కాసేపు కంగారు పెట్టింది. డోర్ బెల్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో దాదాప 12 మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకుంది అదంతా భయపడేతప్ప, ఉడుత తప్పేమీ లేదంటున్నారు నెటిజన్లు.
Doorbell camera catches man getting attacked by a squirrel.
Have you ever seen a squirrel like this? pic.twitter.com/l2eISJYdQC— AmericanPapaBear (@AmericaPapaBear) July 2, 2025
> ప్రకృతిలో చాలా ప్రాణులు మనతోపాటు జీవనం సాగిస్తుంటాయి.కొన్ని మనకు కనిపించనంత సూక్ష్మంతో ప్రకృతిలో మమేకమై ఉంటాయి. మరికొన్ని మనతోపాటే, మన చుట్టూనే ఉంటాయి.మనతో స్నేహంగా ఉంటాయి. మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. పర్యావరణ సమతుల్యతో తమవంతు పాత్ర వహిస్తుంటాయి. సాధారణంగా మనుషులు తప్ప ఏ ప్రాణీ అకారణంగా ఎవరిమీదా దాడి చేయదు. ఆహారం కోసం, తమకు హాని కలుగుతుందని భావించినపుడు, తమ మీద దాడి చేస్తున్నారని భయపడినపుడు మాత్రమే మనుషులను మీదికి ఎగబడతాయి. ఇందులో పాములకు కూడా మినహింపేమీ కాదు. నిజానికి పాములు చాలా పిరికివట.