
ముంబై: మహారాష్ట్రలోని థానేలో మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఫుడ్ స్టాల్ యజమానిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) దాడి చేసిన దరిమిలా రాష్ర్టంలో బాషా వివాదం మరింతగా ముదిరింది. ఈ నేపధ్యంలో పార్టీ చీఫ్ రాజ్‌థాక్రే.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీచేశారు. తన అనుమతి లేకుండా పార్టీలోని ఎవరూ కూడా మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయవద్దని కోరారు.
మీడియాతో మాట్లాడే బాధ్యత కలిగిన పార్టీ నేతలు, సభ్యులు ఏదైనా కమ్యూనికేట్ చేసేముందు తన అనుమతి తీసుకోవాలని రాజ్‌థాక్రే సూచించారు. అయితే వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలియజేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేష్మా తపసే బాషా వివాదంపై వ్యాఖ్యలు చేసిన దరిమిలా.. రాజ్‌థాక్రే ఈ విధమైన ఆదేశాలు జారీచేశారు. మరాఠీని గౌరవించని ఎవరిపైన అయినా పార్టీ దేశద్రోహం కేసులు నమోదు చేస్తుందని రేష్మా తపసే పేర్కొన్నారు.
"Do Not Talk To Media": Raj Thackeray's Message To MNS Leaders https://t.co/dU1pAWiIkb pic.twitter.com/xEgDwN0e4e
— NDTV (@ndtv) July 8, 2025
భాష పేరుతో పోరాటం చేస్తున్న తమ నేతలు, కార్యకర్తలు పలు కేసులు ఎదుర్కొంటున్నారని తపసే పేర్కొన్నారు. తనపై కూడా ఇటువంటి కేసులు ఉన్నాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. ఇక్కడికి వచ్చి, స్థిపడిపడివారు మరాఠీలో మాట్లాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలన్నారు. కాగా విలేకరి ఆమెను మీరు కర్నాటక వెళితే కన్నడ మాట్లాడుతారా? అని అడగగా, ఆమె తనకు కన్నడ బాష రాదని, కర్నాటకకు ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు.