డెంటిస్ట్‌ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి | Dentist Suicide Case Key facts Come out In Bengaluru | Sakshi
Sakshi News home page

డెంటిస్ట్‌ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి

Aug 11 2022 12:46 PM | Updated on Aug 11 2022 1:04 PM

Dentist Suicide Case Key facts Come out In Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: బనశంకరిలో చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంత వైద్యురాలు శైమా ఉదంతం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు తేలింది. ఆమెను పుట్టింటివారు రానివ్వకపోవడమే కారణమని బయట పడింది.

కొడగు జిల్లా విరాజపేటకు చెందిన శైమా బీడీఎస్‌ చదువుతూ, సహచరుడు  నారాయణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లలేదు. దీంతో కొన్నాళ్లకు శైమా తల్లి దిగులుచెంది విరాజపేటలో ఆత్మహత్య చేసుకుంది. ఈ పరిణామాలతో పుట్టింటివారు శైమాను తమ ఇళ్లకు రానివ్వలేదు. ఆమె నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినప్పటికీ ఎవరూ సరిగా మాట్లాడలేదు. ఈ పరిణామాలతో విరక్తి చెంది కూతురికి ఉరివేసి, తానూ ప్రాణాలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. 

చదవండి: (కాలేజ్‌ డేస్‌లో లవ్‌ ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా ఎందుకు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement