రైతుల నుంచి తప్పించుకోవడానికి పోలీసుల సాహసం

Delhi Police Forced To Jump 15 Foot Wall At Red Fort To Escape farmers - Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన  ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులను నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకు కదిలారు. కొందరు నిరసనకారులు పోలీసులపైకి కర్రలతో దాడి చేయగా, ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు ఎర్రకోట సమీపంలోని 15 అడుగుల లోతున్న కందకంలోకి దూకారు. మరికొందరు పట్టుకోల్పోయి దానిలోకి జారి పడిపోయారు. (విషాదకరం...దురదృష్టకరం)

రైతుల నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు-రైతులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 153 మంది పోలీసులు గాయపడ్డారు. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి 13 కేసులను పోలీసులు నమోదు చేశారు. రైతుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అలాగే, భారీగా పారామిలటరీ బలగాలను మోహరించింది. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది. (హింసను ఖండించిన రైతు సంఘాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top